సమస్యలపై కమిటీలు వేస్తే ఏళ్ళు గడిచినా ఫలితం దక్కదు: సీఎం
రాష్ట్రంలో కొన్ని సమస్యలపై కమిటీలు వేస్తే ఏళ్ళు గడిచినా పరిష్కారం రాదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాలో అమ్మహస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో రెండు నెలల్లోనే కమిటీ నివేదిక తీసుకువచ్చామని చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కూడా ప్రశ్నించాయని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో బీసీల కోసం ఏడాదికి రూ. 158 కోట్లు ఖర్చు పెడితే, కాంగ్రెస్ సర్కారు సంవత్సరానికి రూ. 4027 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం వెల్లడించారు.